ఏపీలో ఆశా వర్కర్లకు వరాల జల్లు
ఏపీలోని ఆశావర్కర్లకు ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఆశా కార్యకర్తలందరికీ ప్రయోజనం చేకూర్చేలా గ్రాట్యుటీ చెల్లించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అలాగే వారికి మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వనున్నారు. రిటైర్‌మెంట్ వయో పరిమితిని 62 ఏళ్లకు పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నిర్ణయంతో దాదాపు 42,752 మంది ఆశా కార్యకర్తలకు లబ్ది చేకూరనుంది. ప్రస్తుతం రూ.10 వేల వేతనం పొందుతున్న వీరికి సర్వీసు ముగింపు నాటికి రూ.1.5 లక్షలు అందే అవకాశం ఉంది.

