రైతులకు కీలక సూచన..
‘బోర్లు తవ్వి పంటలు వేయొద్దు. అప్పులు చేసి బోర్లు వెయ్యొద్దు. వర్షం ఉంటేనే పంటలు వేయండి’ అంటూ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి రైతులకు సలహా ఇచ్చారు. రైతులే దేశానికి వెన్నెముక అని, రైతుల కోసం సీఎం రేవంత్ రెడ్డి చేయగలిగినంతా చేస్తున్నారని హామీ ఇచ్చారు. రాబోయే వేసవిలో నీటికి ఇబ్బందులు ఉండవచ్చని, బోర్లు వేసి అప్పులపాలు కావొద్దని పేర్కొన్నారు. నీరు ఉంటేనే, వర్షాలు పడితేనే పంటలు వేయండని సలహా ఇచ్చారు.

