Breaking NewscrimeHome Page SliderTelangana

ఆత్మ‌హ‌త్య‌కు అనుమ‌తివ్వండి ప్లీజ్‌..!

ఎస్సై వేధింపులు తట్టుకోలేకపోతున్నాం.. ఆత్మహత్యకు అనుమతించండి సార్ అంటూ ఫ్లెక్సీతో కలెక్టరేట్ ఎదుట వృద్ధ దంపతులు వినూత్న రీతిలో నిర‌శ‌న వ్య‌క్తం చేశారు.భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం వేములపల్లికి చెందిన సంది సులోచన, ప్రతాప్ రెడ్డి దంపతులకు 12 ఎకరాల భూమి ఉంది.ఈ భూమికి వెళ్లడానికి ఉన్న దారిని రెండున్నరేళ్లుగా ములుగు జిల్లా కన్నాయిగూడెం ఎస్సైగా పనిచేస్తున్న ఇనిగాల వెంకటేష్, అతడి సోదరుడు, తండ్రి కలిసి మూసివేశారని వృద్ధ దంపతులు ఆరోపిస్తూ ఎస్పీ కార్యాల‌యం చుట్టూ కాళ్ల‌రిగేలా తిరుగుతున్నారు.దీనిపై హైదరాబాద్ వెళ్లి ప్రజావాణిలో ఫిర్యాదు చేశామ‌ని..అయితే ఇలా ఫిర్యాదు చేసినందుకు త‌మ‌పై ఎస్సై అక్రమ కేసులు పెడుతున్నారని ఆందోళన వ్య‌క్తం చేశారు.మూడేళ్లుగా పొలానికి వెళ్లలేక వ్యవసాయం చేయట్లేదని.. తమకు ఆత్మహత్యే దిక్కని, ఆత్మహత్యకు అనుమతించాలని ఫ్లెక్సీతో భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట నిరసన వ్య‌క్తం చేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.