Home Page SliderPoliticsTelangana

టీడీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు

టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సినీ నటి, బీజేపీ నేత మాధవీలత సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు చేశారని, అతని అనుచరులు తనను బెదిరిస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డిసెంబర్ 31న జేసీ పార్కులో మహిళలకు మాత్రమే అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇలాంటి వేడుకలకు వెళ్లకూడదని, అర్థరాత్రి ఏమైనా జరిగితే ఎలా అని మాధవీలత వ్యాఖ్యానించారు. దీనితో జేసీ అనుచితంగా మాట్లాడుతూ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటు అతని అనుచరులు ఆమెను చంపుతామని బెదిరిస్తున్నారని ఆమె కంప్లైంట్ చేశారు.