Andhra PradeshBreaking NewscrimeHome Page Slider

వావివ‌రుస‌లు మ‌రిచాడ‌ని కొడుకును చంపేయించింది

ముక్క‌లు ముక్క‌లుగా న‌రికి కాకుల‌కు గ‌ద్ద‌ల‌కు వేస్తా… ప్ర‌తీ మ‌నిషికి కోపంలో వ‌చ్చే మాట ఇది. కానీ దీన్ని ఓ త‌ల్లి మాత్రం నిజం చేసి చూపింది.మ‌ద్యం మ‌త్తులో వ‌రుస త‌ప్పాడ‌ని క‌న్న కొడుకునే కిరాయి ఇచ్చి మ‌రీ చంపేయించింది ఓ ఆత్మాభిమానం గ‌ల త‌ల్లి.మందు తాగితే త‌ల్లికి,పెళ్లానికి తేడా తెలీదా …అంటూ చాలా మంది అంటుంటారు.కానీ ఓ మృగాడు ఈ విష‌యాన్ని ఆద‌మ‌రిచాడు.అందుకే క్ర‌మ శిక్ష‌ణ త‌ప్పాడ‌ని త‌ల్లే బెత్తందారునిగా మారిపోయింది.కాక‌పోతే క‌ర్ర వాడాల్సిన చోట క‌త్తివాడింది.ప్రకాశం జిల్లాకు చెందిన సాలమ్మకు నలుగురు పిల్లలు.మూడో వాడైన శ్యాంబాబు(35) మద్యానికి బానిసై దొంగతనాలు కూడా చేసేవాడు.కొద్దిరోజుల కిందట మద్యం మత్తులో బంధువుల అమ్మాయితోను, చివరికి తల్లితోను అసభ్యంగా ప్రవర్తించాడు.దీంతో విసిగిన పోయి… ఒక ఆటో డ్రైవర్ కు సుపారి ఇచ్చి, కొడుకును ముక్కలుగా నరికి పంట కాలువలో పడేవేయించింది తల్లి లక్ష్మి. కాల్వగట్టుపై రక్తపు మరకలు చూసి పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. విచారణలో తల్లి లక్ష్మి నేరాన్ని అంగీక‌రించింది.ఇద్దరు సోదరులు మరొక వ్యక్తి సహాయంతో హ‌త్య చేయించాన‌ని ఒప్పుకుంది.