నకిలీ ఏసిబి ఉచ్చులో ఎమ్మార్వో
యాదాద్రి జిల్లా రాజాపేట తహశీల్దార్‌కు ఓ నకిలీ ఏసిబి అధికారి కుచ్చుటోపి పెట్టాడు.ఏసీబీ అధికారిని అంటూ తహశీల్దార్ దామోదర్‌కు ఫోన్ చేసి పలు విషయాలు లేవనెత్తాడు.దాంతో కంగుతిన్న తహశీల్దార్ సదరు నకిలీ అధికారికి పెద్దమొత్తంలో డబ్బులు పంపాడు. మండలంలో అవినీతికి పాల్పడుతున్నావని డబ్బులు ఇవ్వకపోతే అరెస్ట్ తప్పదంటూ హెచ్చరించాడు. దాంతో తహశీల్దార్ దామోదర్ ఆన్‌లైన్‌లో సదరు దుండగుడికి రూ.3.30లక్షలు పంపాడు.ఈ విషయాన్ని పలువురు అధికారులతో ఆయన చర్చించాడు.ఈ క్రమంలో కొన్ని సందేహాలు తలెత్తడంతో తీరా మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్‌లో ఎమ్మార్వో దామోదర్ ఫిర్యాదు చేశాడు. దామోదార్ ఫిర్యాదు నమోదు చేసుకుని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.