భార్య సతాయింపులతో గాయకుడి ఆత్మహత్య..
ఒడిశాకు చెందిన ర్యాప్ సింగర్ అభినవ్ సింగ్ (32) బెంగళూరులోని తన నివాసంలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. భార్య వేధింపుల వల్లే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని అతని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కాగా అభినవ్ ఒడియా ర్యాప్ సాంగ్స్‌తో, కథక్ ఆంథెమ్ సాంగ్స్‌తో బాగా పాపులర్ అయ్యారు. అతడు అర్బన్ లోఫర్ అనే మొదటి హిప్ హాప్ లేబుల్‌ను స్థాపించారు. ఇటీవల అతుల్ సుభాష్ అనే భార్యాబాధితుడి ఆత్మహత్య, దానికి ముందు అతడు విడుదల చేసిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనమయిన సంగతి తెలిసిందే.

