Home Page SliderNationalNews AlertTrending Today

కుంభమేళాలో అంబానీ ఫ్యామిలీ..

మాఘ పూర్ణిమ పర్వదినం కారణంగా మహా కుంభమేళాకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఈ తాకిడికి ఎన్నడూ లేనంతగా 350 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అయితే కుంభమేళాకు ప్రముఖుల తాకిడి కూడా తప్పడం లేదు. తాజాగా భారత కుబేరుడిగా పేరు పొందిన ముఖేష్ అంబానీ తన కుటుంబంతో సహా ఈ ఆధ్యాత్మిక వేడుకకు విచ్చేశారు. తన కుటుంబంతో కలిసి బోట్ రైడ్ చేశారు. త్రివేణి సంగమానికి కూడా చేరుకుని ఫోటోలు షేర్ చేశారు. దీనితో ఇవి వైరల్‌గా మారాయి. భారీ ట్రాఫిక్ జామ్‌లకు భయపడి కుంభమేళా ప్రాంతాన్ని ఇప్పటికే నో వెహికల్ జోన్‌గా మార్చారు. ఇప్పటి వరకూ 44కోట్లమంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంకొన్ని రోజులు మిగిలి ఉండడంతో 50 కోట్లు దాటవచ్చని అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు, రాష్ట్రాల సీఎంలు వంటి ప్రముఖులు ఇక్కడ ఇప్పటికే పుణ్యస్నానాలు ఆచరించారు.