Breaking NewscrimeHome Page SliderNews Alert

పల్నాడు జిల్లా డి.ఆర్‌.డి.ఏ. పిడీ బాలు నాయక్ పై వేటు

అమరావతి, అచ్చంపేట మండలాల్లో మంజూరు చేసిన వెలుగు రుణాల్లో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు రావ‌డంతో పల్నాడు జిల్లా డి.ఆర్‌.డి.ఏ. పిడీ బాలు నాయక్ పై వేటు వేశారు.అమరావతి మండలంలో కోటి రూపాయలకు పైగా వెలుగు రుణాలు పక్కదారి పట్టాయని ఆరోపణలు వచ్చిన సంగ‌తి తెలిసిందే. అవినీతికి పాల్పడిన ఉద్యోగులకి అండగా ఉండటం, కింది స్థాయి సిబ్బందిని వేధింపులకు గురి చేయడం అనే ఆరోపణలతో వేటు ప‌డిన‌ట్లు తెలిసింది.పిడి బాలు నాయక్ ని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ జిల్లాడి ఆర్ ఓ మురళి ఆదేశాలు జారీ.