వేలం పాటకు సర్పంచ్ పదవి
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం గోకులపాడు గ్రామంలో సర్పంచ్ పదవికి వేలం పాటకొచ్చింది.రూ.27.50 లక్షలకు వేలం పాటలో సర్పంచ్ పదవిని భీమరాజు అనే వ్యక్తి దక్కించుకున్నాడు.వినడానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా…ఇదే నిజం.నోటిఫికేషన్ రాగానే నగదు చెల్లించి ఏకగ్రీవం చేసేందుకు వేలంపాట వేశారు.కానీ భీమరాజుకు ముగ్గురు పిల్లలు ఉండడంతో, ఎలక్షన్ రూల్ ప్రకారం అతనికి పదవి దక్కుతుందా లేదా అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇదిలా ఉండగా ….సుప్రీం కోర్టు ఈసారి అనూహ్య తీర్పునిచ్చింది.ఏకగ్రీవాలు లేవని ఒక్కరు వచ్చినా సరే నామినేషన్ ప్రకారం ఎన్నిక జరపాలని ఆదేశించింది.ఈ నేపథ్యంలో పదవి కొనుగోలు చేసిన వ్యక్తి పరిస్థితి ఏంటా అనే సందిగ్దం నెలకొంది.


 
							 
							