కిరణ్ రాయల్‌పై జనసేన వేటు
తానెప్పుడూ శుద్దపూసనని చెప్పుకునే తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ ఉరఫ్ కిరణ్ కుమార్ పై జనసేన పార్టీ వేటు వేసింది. ఓ మహిళ తనకు రూ.1.50కోట్లు చెల్లించాలని ,తనకు కిరణ్ తో ఉన్న అతి సాన్నిహిత్యాన్ని వీడియోతో సహా పోస్ట్ చేయడంతో జనసేన చీఫ్ ఈ నిర్ణయం తీసుకున్నారు.ఆ వీడియోలో నువ్వే నాలైఫ్ అంటూ సదరు మహిళ అన్నప్పుడు….నువ్వు నా వైఫ్…కైఫ్…నైఫ్ అంటూ కిరణ్ రాయల్ హేళనగా మాట్లాడిన విషయం కూడా స్పష్టంగా కనిపించింది. దీంతో జనసేన చీఫ్ తాత్కాలికంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నోటీస్ జారీ చేశారు.ఇదిలా ఉండగా….మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై వెటకారంగా 2.0 అంటూ పోస్టర్లు రిలీజ్ చేసిన రెండు రోజులకే కిరణ్ ఇలాంటి చిక్కుల్లో పడటంతో వైసీపి సోషల్ మీడియా కిరణ్ రాయల్‌ని చెడుగుడు అడింది.