సోనూసూద్ ను అరెస్ట్ చేయండి
ప్రముఖ నటుడు సోనుసూద్ కు బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది పంజాబ్ లోని లూథియానా కోర్టు. ఈ మేరకు సోనుసూదన్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో కోర్టు ఇలా ఆదేశించింది.లుథియానాకు చెందిన న్యాయవాది రాజేశ్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ.10 లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు వేశాడు. రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు పేర్కొన్నారు. ఈ కేసులో సదరు న్యాయవాది సోనూసూద్ ను సాక్షిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పిటిషన్ పై విచారణ చేపట్టిన లూథియానా కోర్టు.. సోనుసూద్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.. ఇదిలా ఉండగా.. ఈ కేసు ఈ నెల 10న మరోసారి విచారణకు రానుంది. ఇక, సోనుసూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

