Home Page SliderTelangana

దానం ఇంట్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ.. అందుకేనా..?

తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇంట్లో భేటీ అయ్యారు. స్పీకర్ కార్యాలయం నోటీసుల విషయంలో ఏం చేయాలి? అసెంబ్లీ సెక్రటరీకి, సుప్రీంకోర్టుకు ఏం సమాధానం ఇవ్వాలి..? అనే అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి జరగబోయే ఈ సమావేశానికి ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జి దీపా దాస్ మున్షీ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ హాజరుకానున్నారు. పార్టీ ఎమ్మెల్యేలను మొత్తం నాలుగు గ్రూపులుగా విడదీసి వారితో సీఎం భేటీ కాబోతున్నట్లు సమాచారం. ఈ సమావేశం కోసం దీపా దాస్ మున్షీ రాష్ట్రానికి రానున్నట్లు తెలుస్తోంది.