ఎయిర్ వేస్‌లో సాంకేతిక లోపం
శంషాబాద్ నుంచి బయలుదేరాల్సిన హైదరాబాద్-తిరుపతి విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దీంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు.టికెట్ కౌంటర్ల దగ్గర కొద్దిసేపు నిరశన వ్యక్తం చేశారు. ఉ.5:30 గంటలకు బయల్దేరాల్సిన విమానంచివరి నిమిషంలో రద్దైనట్లు ప్రకటించడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.4 గంటలుగా ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల పడిగాపులు పడ్డారు.ఎయిర్వేస్ తీరుపై తిరుమల వెళ్లే ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.దర్శన సమయం దాటిపోతుందని ప్రయాణికుల ఆవేదన వ్యక్తం చేశారు.అయిన ఇంత వరకు ఎయిర్ వేస్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు.

