వీధికుక్కలకు చిన్నారి విలవిల
భాగ్యనగరంలోని పలు ప్రాంతాల్లో వీధికుక్కల బెడద పెరిగిపోయింది. జంతువుల కళేబరాలు,మాంసీకృ వ్యర్ధాలను తినడానికి అలవాటు పడి చివరకు అవి దొరక్కపోతే మతిస్థిమితం కోల్పోతున్నాయి.ఫలితంగా చిన్నారులు కనిపిస్తు చాలు..కళేబరాలుగా భావించి వెంటపడి ఈడ్చుకెళ్లి చంపేస్తున్నాయి.దీనికి సంబంధించిన ఓ ఘటన హైద్రాబాద్లోని రాజేంద్ర నగర్లో చోటు చేసుకుంది. గోల్డెన్ హైట్స్ కాలనీలో ఒంటరిగా రోడ్డుమీద ఆడుకుంటున్న ఓ నాలుగేళ్ల చిన్నారిని వీదికుక్కలు దాడి చేశాయి.ఒక కాలుని పీక్కుతిన్నాయి.మరికొన్ని శరీర భాగాలను తీవ్రంగా గాయపరిచాయి.అటుగా వెళ్తున్న పాదచారులు వాటిని అదలించేలోపే జరగరాని ఘోరం జరిగిపోయింది.దీంతో చిన్నారి పరిస్థితి విషమంగా మారడంతో ఆసుపత్రికి తరలించారు.