Andhra PradeshHome Page SliderPolitics

మాజీ మంత్రిపై విచారణకు ఆదేశం.. పవన్ కళ్యాణ్

అటవీ భూముల ఆక్రమణలపై మాజీ మంత్రి, వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనేక ఆరోపణలు వచ్చినట్లు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ విషయంలో అటవీ శాఖా మంత్రిగా ఆయన విచారణకు ఆదేశాలు జారీ చేశారు. పెద్ది రెడ్డిపై చిత్తూరు జిల్లాలోని మంగళం పేట సమీపంలో అడవులలో భూకబ్జా ఆరోపణలు వచ్చినట్లు పవన్ తెలిపారు. ఈ వ్యవహారంపై విచారణలు జరిపి, నివేదిక సమర్పించాలని అటవీశాఖ ఉన్నతాధికారులను పవన్ ఆదేశించారు.