Home Page SliderNationalNews AlertPolitics

చంద్రబాబుకు సుప్రీంలో భారీ ఊరట

ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో భారీ ఊరట కలిగింది. ఆయనపై ఉన్న సీఐడీ కేసులను సీబీఐకి బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేసింది. ఆయనపై నమోదైన 7 కేసులను సీబీఐకి బదిలీ చేయాలని హైకోర్టు న్యాయవాది బి. బాలయ్య పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్ చెల్లదంటూ సుప్రీంకోర్టు కొట్టివేసింది. జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం ఈ పిటిషన్‌లో వాదనలు వినిపించడానికి న్యాయవాది మణిందర్ సింగ్ సిద్దమవుతుండగా, ఇలాంటి పిటిషన్లు కూడా మీరు వాదిస్తారా అని అసహనం వ్యక్తం చేశారు.