Home Page SliderTelangana

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు బ్యాంకు నోటీసులు

బీఆర్ఎస్ నేత, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా నోటీసులు జారీ చేసింది. గతంలో షకీల్ ఎస్బీఐకి 19 కోట్లు రూపాయల అప్పు ఉంది. ఈ అప్పుకు సంబంధించిన బకాయిలను సకాలంలో చెల్లించకపోవడంతో ఆ బ్యాంక్ నోటీసులు జారీ చేసింది. రూ.19 కోట్ల బకాయి గడువులోగా చెల్లించకపోతే ఆస్తులు జప్తు చేస్తామని హెచ్చరించింది. అయితే బ్యాంక్ నోటీసులపై మాజీ ఎమ్మెల్యే షకీల్ కానీ అతని అనుచరులు కానీ ఇంతవరకు స్పందించలేదు.