Home Page SliderNational

క్రికెట్ అభిమానులకు బంపర్ ఆఫర్

స్వదేశంలో టీమిండియాతో ఇంగ్లండ్ ఐదు మ్యాచ్ ల టీ20 క్రికెట్ సిరీస్ లో భాగంగా ఇవాళ తొలి మ్యాచ్ కు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికైంది. రెండో టీ20 చెన్నైలోని చెపాక్ స్టేడియంలో శనివారం జరగనుంది. ఈ క్రమంలోనే క్రికెట్ అభిమానులకు తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మ్యాచ్ ను చూసేందుకు స్టేడియానికి వచ్చే ప్రేక్షకులకు మెట్రో రైలు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్నట్లు ప్రకటించింది. మ్యాచ్ టికెట్లు కొనుగోలు చేసిన ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీసీఏ ప్రతినిధులు వెల్లడించారు. అయితే, చెపాక్ స్టేడియం చుట్టు పక్క ప్రాంతాల్లో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ఇలాంటి ప్రయోగం చేసినట్లుగా తెలిపారు.