HealthHome Page SlidermoviesTelangana

‘ఎప్పుడు కోలుకుంటానో నాకే తెలియదు’..రష్మిక

స్టార్ హీరోయిన్ రష్మిక ఇటీవల జిమ్‌లో వర్కౌట్లు చేస్తూ తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఆమె వీల్‌చైర్‌లో కనిపించడంతో అభిమానులు కంగారు పడ్డారు. తన హిందీ చిత్ర ప్రచారం కోసం ఆమె ముంబయి బయల్దేరారు. ఆమె ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తన రానున్న చిత్రాలు ‘సికందర్, థామ, కుబేర’ సెట్స్‌లో పాల్గొనాలని ఆశిస్తున్నానని, కానీ పూర్తిగా ఎప్పుడు కోలుకుంటానో తెలియడం లేదని, దర్శకులను క్షమించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఆమె ప్రస్తుతం ‘ఛావా’ అనే చిత్రంలో బిజీగా ఉన్నారు.  చిత్రం ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విక్కీ కౌశల్ హీరోగా లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్ ఇది.