తోడేళ్ల రాజ్యంలో రాలిన మట్టిపూలు 406..కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం కాదు..తోడేళ్లలా ప్రాణం తీసే ప్రభుత్వమని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్‌ఎస్ నేత కేటీఆర్. రైతుల ఆత్మహత్యలపై స్పందిస్తూ తోడేళ్ల రాజ్యంలో రాలిన మట్టిపూలు 406 అంటూ వ్యాఖ్యానించారు. రుణమాఫీ చేయకుండా తీసిన ప్రాణాలు, రైతుబంధు వేయకుండా చేసిన ఖూనీలు. ఆ కుటుంబాల మనోవేదనలే మీ సర్కారుకు మరణ శాసనం రాస్తాయి. వారి కన్నీళ్లే ఈ కపట సర్కారును కూల్చేస్తాయి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఇప్పటికి రాలిన మట్టిపూలు 406 మంది. పెట్టుబడులు భారమై అప్పుల బాధలో రాష్ట్రంలో ఒక్కరోజే నలుగురు అన్నదాతల అత్మహత్యలు.


