తిరుపతి జిల్లాలో విషాదం
తిరుపతి జిల్లాలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాద్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ పటాన్‌చెరుకు చెందిన సందీప్(45), అంజలీదేవి(40) తిరుపతి నుండి హైదరాబాద్ వస్తున్న సమయంలో వీరి కారును రేణిగుంట సమీపంలో కుక్కలదొడ్డి వద్ద ఒక ప్రైవేట్ బస్సు కారును ఢీ కొట్టింది. దీనితో వీరిద్దరూ మృతి చెందారు.