Andhra PradeshBreaking NewscrimeHome Page SliderNews Alert

జాతీయ ర‌హ‌దారిపై జ‌ర్నీ సినిమా క్లైమాక్స్ సీన్

సూర్యాపేట జిల్లాలో హైదరాబాద్ – విజయవాడ 65వ జాతీయ రహదారిపై SV కళాశాల సమీపంలో రెండు ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సులు ఢికొన్న ఘ‌ట‌న‌లో ఇద్ద‌రు స్పాట్‌లో మ‌ర‌ణించారు.ఈ ఘటనలో క్లీన‌ర్‌… బస్సు అద్దంలో నుంచి ఎగిరిపడగా.. అతడి పైనుంచి బస్సు వెళ్లడంతో స్పాట్లోనే మృతి చెందాడు.ఈ ఘ‌ట‌న‌ను ప్ర‌త్య‌క్షంగా చూస్తూ మరో ప్రయాణికుడు గుండెపోటుతో బ‌స్సులోనే మృతి చెందాడు. ప్ర‌మాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.వీరి ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో హుటాహుటిన అంబులెన్స్ లో జిల్లా పెద్దాసుప‌త్రికి త‌ర‌లించారు.మిగిలిన క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు.రెండు బస్సులు గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం జ‌రిగింది.మృతిచెందిన వారు గుంటూరువాసులు సాయి, రసూల్‌గా గుర్తించారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ట్రాఫిక్ ని క్లియ‌ర్ చేశారు. మృత‌దేహాల‌ను పోస్టు మార్టం నిమిత్తం ఏరియా ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.