రాహుల్ గాంధీకి సావర్కర్ కేసులో ఊరట
కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్షనాయకుడు రాహుల్ గాంధీకి పరువునష్టం కేసులో ఊరట లభించింది. హిందుత్వ సిద్ధాంతకర్త సావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పరువునష్టం కేసులో రాహుల్‌కు పుణె కోర్టు బెయిల్ వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా రాహుల్ గాంధీ వర్చువల్‌గా హాజరు అయ్యారు. ప్రజాప్రతినిధుల కోర్టు రూ.25 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్ జోషి కోర్టుకు ష్యూరిటీ ఇచ్చారు. తదువరి విచారణను ఫిబ్రవరి 18వ తేదీకి వాయిదా వేసింది. అయితే ఈ విచారణకు కూడా రాహుల్ గాంధీ ప్రత్యక్ష విచారణకు హాజరు అయ్యే అవసరం లేదని మినహాయింపు ఇచ్చారు.

