రైల్వేశాఖలో …దుప్పట్ల దుమారం
సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వేలో దుప్పట్ల సరఫరా కుంభకోణం జరిగింది. ఈ మేరకు దుప్పట్ల సరఫరా అక్రమాలపై సీబీఐ కేసు నమోదు చేసింది. 3.39 లక్షల కాటన్ బెడ్‌షీట్ల సరఫరాకు దక్షిణ మధ్య రైల్వే టెండర్లు పిలవగా… . రూ.7.86 కోట్ల విలువైన 60 శాతం దుప్పట్ల సరఫరాకు యూపీ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది .అయితే 1.4 లక్షల దుప్పట్లను సరఫరా చేయగా నాణ్యతపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో సీబిఐ కేసు నమోదైంది. ఈ క్రమంలో హైదరాబాద్ టెక్స్‌టైల్స్ కమిటీ దుప్పట్లను పరిశీలించి నాణ్యత లేదని నివేదిక అందించింది. సరఫరాదారుతోపాటు బాధ్యులైన అధికారులపై నా సీబిఐ కేసు నమోదు చేసింది.

