ఈ సమయంలో అలర్ట్‌గా ఉండండి
కొత్త సంవత్సరం వేళ సైబర్ నేరస్థులు విజృంభించే అవకాశం ఉందని, సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా డిస్కౌంట్లు, కూపన్స్, ఆఫర్లు అంటూ ఎర వేస్తారని అలాంటి లింక్‌లు, మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా, అలర్ట్‌గా ఉండాలని సూచిస్తున్నారు. వాటిని క్లిక్ చేస్తే వాటి ద్వారా మీ పర్సనల్ డేటాతో పాటు బ్యాంకు ఖాతాలు చోరీ అయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అలాంటివేమైనా జరిగితే 1930 టోల్ ఫ్రీ నెంబరును సంప్రదించాలని సూచిస్తున్నారు.

