మూసీ భయంతో గుండెపోటు
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించతలపెట్టిన మూసినది ప్రక్షాళన ప్రతిపాదన నేపథ్యంలో పరివాహక ప్రాంతంలో నెలకొన్న ఆక్రమణలు కూల్చివేస్తారేమోనన్న భయంతో ఓ వ్యక్తి గుండెపోటు కి గురై కన్నుమూసిన ఘటన శుక్రవారం తెల్లవారు ఝామున జరిగింది.హైద్రాబాద్‌లోని రామంతాపూర్ లక్ష్మీనారాయణ కాలనీ- కేటీఆర్ నగర్ కి చెందిన రవీందర్ ఇంటికి గురువారం హైడ్రా అధికారులు మార్కింగ్ వేశారు.దీంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఇరుగు పొరుగు వాళ్లు ఇక నీ ఇంటిని కూల్చి వేయడం ఖాయం అంటూ చెప్పే సరికి తీవ్ర ఆందోళనతో ఈ తెల్లవారు ఝామున గుండెపోటుతో మరణించాడు.దీనిపై ఎక్స్‌లో కేటిఆర్ స్పందించాడు.ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు.రేవంత్ సర్కార్ సాగిస్తున్న దుర్మార్గపు పాలనకు మరో ప్రాణం బలయ్యిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.బాధిత కుటుంబాన్ని తక్షణమే ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

