ఇజ్రాల్‌యెల్‌కు ముప్పు తప్పేట్లు లేదు!
సిరియాలో అసద్ ప్రభుత్వం కుప్పకూలడంతో ఇజ్రాయెల్‌కు పెను ముప్పు దాపురించింది. ఇజ్రాయెల్ నియంత్రణలో ఉన్న గోలన్ హైట్స్ సమీపంలో హయత్ తహ్రీర్ అల్ షామ్ – హెచ్‌టీఎస్ వంటి సిరియా తిరుగుబాటు దళాలు పాగా వేయడంతో ఈ ప్రమాదం పొంచి ఉంది. దీంతో రసాయన తదితర అధునాతన ఆయుధాలు శత్రు చేతుల్లోకి చేరడం వల్ల ఇజ్రాయెల్ మరింత ఆందోళన చెందుతోంది. దీంతో తమకు ముప్పు పొంచి ఉందని ఇజ్రాయెల్ కలవరపడుతోంది.సిరియా నుంచి ముప్పు పొంచి ఉందని భావించిన ఇజ్రాయెల్ డిఫెన్సివ్ చర్యలకు ఉపక్రమించింది. గత కొద్ది రోజులుగా సిరియాలో ఉన్న డీ-మిలిటరైజ్డ్ బఫర్ జోన్‌ను ఆధీనంలోకి తీసుకునేందుకు చర్యలు ప్రారంభించింది. ఇప్పటికే బఫర్ జోన్‌లోని 400 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకునేందుకు తమ దళాలు బయలుదేరాయని ఆదివారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఆదివారం గోలన్ హైట్స్‌లో పర్యటించిన నెతన్యాహు, సిరియా భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని విచిడిపెట్టాయని, అందుకే బఫర్ జోన్‌ను తమ ఆధీనంలోకి తీసుకోవాలనుకున్నట్లు తెలిపారు. అయితే ఇది తాత్కాలిక డిఫెన్సివ్ పొజిషన్ మాత్రమే అని, తమ సరిహద్దులను కాపాడుకోవడం కోసమేనని స్పష్టం చేశారు.