ముంబైలో మున్సిపల్ బస్సు బీభత్సం
దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది.అది అలాంటి ఇలాంటి బస్సు కాదు…ముంబై మున్సిపల్ కార్పొరేషన్‌కి చెందిన బస్సు.అలాంటి బస్సు డ్రైవర్ ని ఎంతో నైపుణ్యం ఉంటే తప్ప కార్పొరేషన్ డ్రైవర్‌గా నియమించదు ప్రభుత్వం.కానీ ఘోరం జరిగిపోయింది.అంతటి నైపుణ్యం ఉన్న డ్రైవర్ పాదచారులు మీదకు బస్సుని పోనిచ్చాడు.దీంతో ఏడుగురు పాదచారులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.మరో 47 మందికి తీవ్ర గాయాలయ్యాయి.ఇంతటి విధ్వంసం జరిగిందంటే ఇక ఆ డ్రైవర్…ఆ బస్సుని ఎంతటి వేగంతో నడుపుతున్నాడో అర్ధం చేసుకోవచ్చు.ఇండియాలోని ప్రధాన నగరాల్లో జరిగిన బస్సు బీభత్సాల్లో ఇది ఫస్ట్ ప్లేస్ లో చేరింది. బస్సులో ప్రయాణిస్తున్న వారు,బస్సు కోసం ఎదురు చూసే వారు,రోడ్ల వెంబడి చిరువ్యాపారాలు చేసుకునే వారు పదుల సంఖ్యలో ఈ బస్సు ప్రమాదానికి గురయ్యారు.ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

