2027లోనే జమిలి ఎన్నికలు
బీజెపి పొలిటికల్ టార్గెట్స్ లో ఒకటైన వన్ నేషన్-వన్ ఎలక్షన్‌ని కేవలం నినాదంగా కాకుండా రెండేళ్లలో కార్యచరణకు సాధ్యపడే విధానంగా మార్చాలన్న సంకల్పం ఎట్టకేలకు సాకారమయ్యే సూచనలు బాగా కనిపిస్తున్నాయి.ఇందులో భాగంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లుని ప్రవేశపెట్టబోతున్నారు.దీనికి సంబంధించిన ముసాయిదాను కూడా సిద్దం చేసినట్లు తెలిసింది.లోక్ సభ,అనంతరం పెద్దల సభలో బిల్లుకి గనుక ఆమోదం లభిస్తే ఇక రాష్ట్రపతి రాజముద్ర వేయడమే తరువాయి.దీనికి పెద్దల సభలో అరాకొర ఉన్న మెజార్టీని కూడా కొత్తగా నిర్వహించే ఎలక్షన్ ద్వారా పూడ్చుకునే వెసులుబాటు కూడా బీజెపికి ఉంది.సో ప్రతిపక్షాలు సైతం జమిలికి సై అంటున్నాయి.దీంతో 2027లోనే దేశ్యవ్యాప్తంగా ఒకే ఎన్నిక జరిగే సూచనలు బలంగా వినిపిస్తున్నాయి.


 
							 
							