హైద్రాబాద్‌కి భూకంపం ముప్పు
హైద్రాబాద్‌లో హిల్లీ ఏరియాస్ మినహాయించి అన్నీ ప్రాంతాలకు భూకంపం ముప్పు ఉందని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అధారిటి అధికారులు వెల్లడించారు.సాధారణంగా పర్వతాలు,కొండలు,శిఖరాలు ఉన్నచోట భూపంపాలు రావు.వచ్చినా ప్రమాదం ఉండదు.ఆయా ప్రాంతాల్లో అగ్నిపర్వత శ్రేణులుంటే వాటి వల్ల మాత్రమే ప్రమాదం ఉంటుంది.హైద్రాబాద్‌లో ఇలా కొండ ప్రాంతాలున్న ఏరియాల్లో ఇంత వరకు భూప్రకంపనలు కనుగొనలేదు.కానీ హైద్రాబాద్‌లో చాలా ప్రాంతాలకు భూకంపం ముప్పు ఉందంటున్నారు.ఇప్పటికే ములుగు లో ఒక భూపంప కేంద్రాన్ని నాలుగు రోజుల కిందటే గుర్తించారు.కాగా శనివారం మరో కేంద్రాన్ని కనుగొన్నారు.కౌకుంట్ల మండలం దాసరిపల్లె గ్రామంలో కొత్త భూకంప కేంద్రాన్ని గుర్తించారు.ఇవాళ రిక్టర్ స్కేల్ పై 3.0గా నమోదయ్యే రీతిలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. దాదాపు 10 సెకన్ల పాటు భూమి కంపించింది.ఈ భూకంప కేంద్రం పల్నాడు జిల్లా నరసరావుపేట అటు కర్నూల్ ఇటు ఝార్ఠండ్ తో పాటు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించేలా ప్రభావం చూపిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.