Home Page SliderNationalNews Alert

పాపం..ఐపీఎస్ పోస్టింగ్ తీసుకోకుండానే అనంతలోకాలకు..

ఎంతో కష్టపడి సాధించుకున్న ఐపీఎస్ ఫలితాన్ని అందుకోకుండానే అనంతలోకాలకు చేరుకున్నారు యంగ్ ఐపీఎస్ ఆఫీసర్. మధ్యప్రదేశ్‌కు చెందిన హర్ష్‌బర్దన్ (26) ఇటీవలే మైసూర్‌లో ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. కానీ విధి అతని తలరాతను మరోవిధంగా రాసింది. అతడు పోస్టింగ్ తీసుకునేందుకు కర్ణాటకలోని హసన్‌కు ప్రయాణమయ్యారు. ఈ ప్రయాణంలో అతడు ప్రయాణిస్తున్న పోలీస్ వాహనం టైర్ పేలి వాహనం చెట్టుకు ఢీకొట్టింది. డ్రైవర్ చిన్నగాయాలతో తప్పించుకోగా, హర్షబర్దన్‌ను ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించేలోగా మృతి చెందాడు. ఈ దుర్ఘటన సిబ్బందిలో విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై సీఎం సిద్దరామయ్య తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అతని కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తూ ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.