Home Page SliderNationalNews Alert

‘ఫెంగల్ తుఫాను బీభత్సం’..విద్యాసంస్థలకు సెలవు

తమిళనాడులో ఫెంగల్ తుఫాన్ భారీ బీభత్సాన్ని సృష్టిస్తోంది. తీవ్ర తుఫానుగా మారి శనివారం పుదుచ్చేరి సమీపంలో తీరాన్ని తాకనుంది. ఈ తుఫాన్ ప్రభావంతో పుదుచ్చేరి, చెన్నై, తమిళనాడులోని అనేక ప్రాంతాలలో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పుదుచ్చేరి, కడలూరు, విల్లుపురం, చెంగల్పట్టు, కళ్లకురిచ్చి, తిరువళ్లూరు, కాంచీపురం, చెన్నై జిల్లాలలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఆయా జిల్లాలలో విద్యాసంస్థలకు నేడు సెలవు ప్రకటించారు. యూనివర్సిటీ స్థాయిలోని పరీక్షలను కూడా వాయిదా వేశారు. ఈ జిల్లాలకు ప్రత్యేక ఐఏఎస్ అధికారులతో కూడిన బృందాలను రంగంలోకి దింపారు. విపత్తు కారణంగా ఎప్పటి కప్పుడు సమీక్ష చేస్తూ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నారు. తుఫాన్ కారణంగా ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి.