సీఎంగా మురళీధర్ మోహోల్..? షాక్ లో ఫడ్నవీస్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మహాయుతి కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోతోంది. తదుపరి సీఎం, శాఖల కేటాయింపులపై పార్టీల మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాకపోవడంతో సందిగ్ధం నెలకొంది. మరోవైపు.. మహారాష్ట్ర నూతన సీఎంగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతున్నా.. రేసులో కొత్తగా మురళీధర్ మోహోల్ పేరు తెర పైకి వచ్చింది. బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే, కేంద్ర హోంమంత్రి అమిత్ షాల మధ్య జరిగిన భేటీలో గందరగోళం ఏర్పడినట్లు కూడా చర్చ జరుగుతోంది. అయితే ఒక్కసారిగా కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ పేరు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. బీజేపీ పుణె ఎంపీ అయిన మురళీధర్ ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. కుస్తీ రంగంలో ఉండగానే బీజేపీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన మురళీధర్ మోహోల్ పూణె లోక్‌సభ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు. తొలి ప్రయత్నంలోనే ఎంపీ సీటు సాధించిన మోహోల్‌కు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి బాధ్యతలు కూడా అప్పగించారు.
Breaking news: ‘ఫెంగల్ తుఫాను బీభత్సం’..విద్యాసంస్థలకు సెలవు

