Andhra PradeshcrimeHome Page SliderLifestyle

విశాఖ‌లో విజృంభిస్తున్న డ‌యేరియా

డ‌యేరియా బాధితుల సంఖ్య నానాటికీ గ‌ణణీయంగా పెరుగుతుంది. ప్ర‌ధానంగా విశాఖ వ‌న్ టౌన్‌లో డ‌యేరియా బారీన ప‌డే వారు అధిక‌మౌతున్నారు. డ‌యేరియా బాధితులున్న చోట ప్ర‌జ‌లంద‌రికీ హెల్త్ చెకప్‌లు చేసేందుకు వైద్యులు స‌న్నాహాలు చేస్తున్నారు.ఇప్ప‌టికే 50 మందికి పైగా ప్ర‌జ‌లు డ‌యేరియా బారీన పడ‌గా ఇందులో ఇద్ద‌రు చ‌నిపోయారు.చాలా మంది ప‌రిస్థితి విష‌మంగా మారింది. దీనిపై ప్ర‌జా సంఘాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. యుద్ద‌ప్రాతిప‌దిక‌న చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని,మురికివాడ ప్రాంతాల్లో విధిగా హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తున్నాయి.