కొత్తకారు కొనుగోలు చేసిన నాగార్జున
సినీ హీరో నాగార్జున హైద్రాబాద్‌లోని ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి గురువారం విచ్చేశారు.ఇటీవల నూతనంగా కొనుగోలు చేసిన టొయోటా లెక్సస్ కారు రిజిస్ట్రేషన్ కోసం ఆయన స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చారు. సంతకం చేసి ఫోటో దిగి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు.ఇలాంటి కార్లను సినీ,రాజకీయ ప్రముఖులు ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున కొనుగోలు చేయడం ట్రెండీగా మారింది. ప్రస్తుతం దీని షోరూం ధర(ఆన్ రోడ్) రూ.2.50కోట్లకు పైనే ఉంది. బాలీవుడ్ ప్రముఖులంతా ఇప్పుడీ ట్రెండీ బ్రాండెడ్ కారును కొనుగోలు చేసి క్రేజీగా ఫీల్ అవుతున్నారు.ఈ నేపథ్యంలో ఆర్టీఏ ఆఫీస్ కి వచ్చిన నాగార్జునను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

