సీరియల్ రైల్వే కిల్లర్ అరెస్ట్
దేశవ్యాప్తంగా 35 రైళ్లలో హత్యలు,దోపిడీలకు పాల్పడిన ఘరానా హంతకుణ్ణి గుజరాత్ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దివ్యాంగుల బోగీల్లోకి చొరబడి నగలు,నగదు ఉన్న ప్రయాణీకులను బెదిరించి వారి నుంచి సొమ్ము దొంగిలించడమే కాకుండా కిరాతకంగా హత్యలు చేస్తున్న కరంవీర్ అనే హంతకుణ్ణి తెలంగాణ పోలీసుల సాయంతో గుజరాత్‌లో చాకచక్యంగా పట్టుకున్నారు.నిందితునిపై అనేక రాష్ట్రాల్లో పాతిక పైగా కేసులున్నాయి.పీటి వారెంట్‌పై తెలంగాణ పోలీసులు నిందితుణ్ణి హైద్రాబాద్ తరలిస్తున్నారు.ఆతను చివరి సారిగా చేసిన హత్య కూడా తెలంగాణకి సంబంధించింది కావడంతో ఇక్కడకు తరలిస్తున్నారు.