Home Page SliderTelanganatelangana,

రైతులకు శుభవార్త

తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వమే రైతుల వద్ద ధాన్యం కొనుగోలు చేసి 3 రోజులలో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 10 వరకూ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇప్పటి వరకూ రూ.5,040 కోట్ల విలువ గల  21.73 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించి, రూ. 2,760 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. విక్రయించిన వెంటనే డబ్బు జమ చేస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం నుండి నీరు రాకపోయినా 66 లక్షల ఎకరాలలో ధాన్యం ఉత్పత్తి అయ్యిందన్నారు.