టీచర్‌ను వేధించి కత్తితో దాడి..
ఇటీవల తమిళనాడులో డాక్టర్‌పై కత్తిపోటు దురాగతాన్ని మరిచిపోకముందే, ఒక టీచర్‌పై ప్రేమోన్మాది కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. మహిళా టీచర్‌ను ప్రేమ పేరుతో వేధించి, కత్తితో క్లాస్‌రూమ్‌లోనే దాడి చేశాడు దుర్మార్గుడు. తమిళనాడులోని తంజావూరులో రమణి అనే టీచర్ ఒక స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆమెతో గత కొంత కాలంగా మదన్ అనే యువకుడు ప్రేమలో ఉన్నారు. అయితే పెళ్లికి ఆమె కుటుంబం నిరాకరించారు. దీనితో ఆమె కూడా అంగీకరించలేదు. ఈ విషయంపై మండిపడ్డ మదన్ ఈ రోజు స్కూలుకు వచ్చి, క్లాస్‌రూమ్‌లో పాఠాలు చెప్తున్న ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఆమె తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా, మృతి చెందింది. ఈ ఘటనపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.