Home Page SliderNational

అక్కడ మైకులు మూగబోయాయి.. అంతా గప్ చుప్..

జార్ఖండ్, మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం ముగిసింది. మహారాష్ట్రలో 288 స్థా నాలకు ఒకే విడుతలో ఈ నెల 20 ఎన్నికలు జరగనున్నాయి. ఇందు కోసం తెలంగాణ, ఏపీ నుంచి కాంగ్రెస్, బీజేపీ, జనసేన నాయకులు వెళ్లి ప్రచారం చేశారు. అదే విధంగా జార్ఖండ్ లో రెండో దశ ఎన్నికల ప్రచారం కూడా ఇవాల్టితో ముగిసింది. మొత్తం 38 స్థానాలకు ఎల్లుండి ఎన్నికలు జరగనున్నాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు కొత్త నినాదాలతో ఇండియా, ఎన్డీయే కూటమి పార్టీలు తమ ప్ర యత్నాలన్నీ చేశారు. మహారాష్ట్రలో మొత్తం 9.63 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. వారిలో 4.97 కోట్ల మంది పురుషులు, 4.66 కోట్ల మంది మహిళ ఓటర్లు ఉన్నారు. ఓటరు ఎవరి వైపు మొగ్గ చూపుతాడనేది ఈ నెల 20న నిర్ధారణ కానుంది.