Andhra PradeshHome Page Slider

ఏపీ స్కూల్స్ టైమ్ పెంపు..

ఆంధ్రప్రదేశ్‌లోని పాఠశాలల సమయాన్ని పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ ప్రస్తుత టైమ్ టేబుల్ ఉండగా, దానిని మరో గంట సమయం పెంచుతూ 5 గంటల వరకూ ఉండాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు వరకూ ఈ సమయం వర్తిస్తుందని తెలిపారు. మొదటగా మండలానికి రెండు స్కూల్స్ చొప్పున కొత్త టైమ్ టేబుల్ ప్రకారం నడుస్తాయని పేర్కొన్నారు. ఉదయం, మధ్యాహ్నం ఇచ్చే విరామ సమయాన్ని పెంచుతున్నారు.  40 నిమిషాలు ఉండే తొలి పీరియడ్స్‌ను 50 నిమిషాలుగా చేశారు. తర్వాత 3 పీరియడ్స్‌ను కూడా 5 నినిషాల చొప్పున పెంచుతూ 45 నిమిషాలు చేశారు. సిలబస్ సకాలంలో పూర్తి చేయడానికే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖ తెలియజేసింది. అయితే 5 కిలోమీటర్ల పైగా దూరం నుండి వచ్చే పిల్లలకు ఈ సమయం పెంపు వల్ల ఇబ్బంది అవుతుందని, వారు చీకటి పడకుండా ఇళ్లు చేరుకోలేరని, ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరుతున్నారు.