బీజేపీ కోసం కీలక బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్
బీజేపీ పార్టీ గెలుపు కోసం ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు తీసుకున్నారు. మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడానికి నిర్ణయించుకున్నారు. మహా యతి కూటమి ప్రచారంలో నవంబర్ 16,17 తేదీలలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఈ మేరకు జనసేన పార్టీ ప్రకటన విడుదల చేసింది. మరట్వాడా, పశ్చిమ మహారాష్ట్ర, విదర్భ రీజియన్లలో పవన్ ప్రచారం చేస్తారు. ఐదు బహిరంగ సభలలో, రెండు రోడ్‌షోలలో పాల్గొంటారు. డెగ్లూర్, భోకర్, లాతూర్, షోలాపూర్, పుణె ప్రాంతాలలో పవన్ ప్రచారం కొనసాగుతుంది.

