హమ్మయ్యా.! భారీగా దిగొచ్చిన బంగారం ధర..
పసిడి ప్రియులకు శుభవార్త. గత వారం రోజుల నుంచి బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అమాంతం పెరిగిన బంగారం ధరలు.. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక క్రమంగా తగ్గుముఖం పడుతూ రూ.80 వేల దిగువకు చేరుకున్నాయి. పెళ్లిళ్ల సీజన్ కు ముందు ధరలు దిగివస్తుండడంతో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో పుత్తడి ధరలు 6 శాతం క్షీణించాయి. ఫలితంగా ఈ నెల 4వ తేదీ తర్వాతి నుంచి ఇప్పటి వరకు 10 గ్రాములకు ఏకంగా రూ. 4,750 తగ్గింది. దీంతో బంగారం కొనుగోళ్లు మళ్లీ ఊపందుకున్నాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల పసిడి ధరపై రూ.1200 తగ్గి రూ.75,650గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం ధరపై రూ. 1100 తగ్గి రూ. 70 వేల దిగువకు పడిపోయింది. కిలో వెండిపై రూ. 2 వేలు తగ్గి రూ. 99 వేలుగా నమోదైంది.