Home Page SliderTelangana

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో తీర్పు రిజర్వు

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన కేసులో హైకోర్టులో ఇవాళ విచారణ ముగిసింది. అసెంబ్లీ కార్యదర్శి దాఖలు చేసిన అప్పీల్ పై వాదనలు విన్న సీజే ధర్మాసనం.. తీర్పును రిజర్వు చేసింది. బీఆర్ఎస్ తరఫున సీనియర్ న్యాయవాది మోహన్ రావు వాదనలు వినిపించారు. సింగిల్ బెంచ్ తీర్పుపై అప్పీల్ చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదన్నారు. అనర్హత పిటిషన్లపై స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఇరు వైపులా వాదనలు విని.. విచారణ ముగిస్తున్నట్టు ప్రకటించిన సీజే ధర్మాసనం.. తీర్పు రిజర్వు చేసింది.