కేటీఆర్ కంటతడి.. ఎమ్మెల్యేగా ఇబ్బంది ఉంటే రాజీనామా చేస్తా..
సిరిసిల్ల నేతన్నలను ఆదుకోవడానికి తాను ఎమ్మెల్యేగా ఉండటమే ఇబ్బంది అయితే రాజీనామా చేసేందుకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సిరిసిల్లలోని వెంకంపేటలో ఆర్థిక ఇబ్బందులతో భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. బలవన్మరణానికి పాల్పడిన దంపతుల పిల్లలతో కేటీఆర్ పరామర్శించి.. వారితో మాట్లాడుతూ కంటతడి పెటుకున్నారు. పిల్లలు ముగ్గురికి ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పార్టీ పరంగా ఫిక్స్డ్ డిపాజిట్ చేసి చదివిస్తామని హామీ ఇచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ఫోన్ లో మాట్లాడి బాధిత కుటుంబానికి రూ.10 లక్షల వరకు పరిహారాన్ని అందించాలని కోరారు. సిరిసిల్లలో ఇప్పటి వరకు 20 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నా.. కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.