ఆటో డ్రైవర్ ట్యాగ్ లైన్ కి అందరూ ఫిదా..
ఓ ఆటో డ్రైవర్.. తన వృత్తిని గర్వంగా చెప్పుకొచ్చాడు. తన కష్టం తన సంపాదన సంతృప్తిని ఇస్తున్నదని చాటుకున్నాడు. ‘నా రోజు ఆదాయం రూ.3 వేలు.. నెలకు రూ. 90 వేలు ఐ యామ్ సాఫ్ట్ వేర్ ‘ అంటూ తన ఆటోపై దర్జాగా రాసుకున్నాడు. ఈ ఆటో ప్రస్తుతం మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కోకాపేట్ ప్రాంతాల్లో తిరుగుతుండగా గమనించినవారు ఇలా ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అవి వైరల్ అయ్యాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగం, జీతాలతోనే కాదు.. తనలా ఆటో నడుపుతూ కూడా సమాజంలో హుందాగా బతకొచ్చంటూ ఆ యువకుడు ఇచ్చిన సందేశానికి, అతడి ప్రవర్తనకి అందరూ ఫిదా అవుతున్నారు.

