Breaking NewscrimeHome Page SliderNewsNews Alerttelangana,

ECIL లో కారుని ఈడ్చుకెళ్లిన ట్రావెల్స్ బ‌స్సు

హైద్రాబాద్‌లో ECIL ప్రాంతంలో శ‌నివారం ట్రావెల్స్ బ‌స్సు విధ్వంసం సృష్టించింది. ఏకంగా కారుని ఢీకొట్టి 150 అడుగుల మేర ఈడ్చుకెళ్లింది.దీంతో కారు న‌డుపుతున్న డ్రైవ‌ర్ … బ‌తుకు జీవుడా అంటూ ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని కారులో నుంచి కింద‌కు దూకేశాడు. దీంతో ఆ ప్రాంత‌మంతా ఆందోళ‌నాభ‌రితంగా మారింది. స్థానికులంతా భ‌యంతో అక్క‌డ నుంచి ప‌రుగులు తీశారు.కారును బ‌స్సు ఈడ్చుకెళ్తున్నంత సేపు ఇదేదో సినిమాలో సీన్ అనుకుని దూరంలో నుంచి చూస్తున్న వారంతా భావించారు.తీరా చూస్తే ….అది లైవ్ లో జ‌రుగుతున్న విధ్వంస అని తెలుసుకుని బీభ‌త్సం చ‌ల్లారాక తీరిగ్గా అక్క‌డ‌కు చేరుకున్నారు.కాగా ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించి పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.