ఈ ఆకుకూర తింటే వయసు వెనక్కి…
ఆకుకూరలను పోషకాల నిధిగా పెద్దలు చెప్తారు. ఆకుకూరలన్నింటిలో ఎర్ర తోటకూరలో ఎన్నో అద్భుత ఔషధ గుణాలున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. ఇది తింటే వయసు వెనక్కి వెళ్లి, నవయవ్వనంలో ఉన్నట్లు కనిపిస్తారని వైద్య నిపుణులు పేర్కొన్నారు. దీనిలో ఏ, సి, ఈ, బి, కాల్షియం, కాపర్, జింక్ వంటి విటమిన్లు, మినరల్స్ ఉన్నాయి. దానిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వారంలో కనీసం రెండుసార్లు ఈ కూరను తింటే మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలు దూరమవుతాయి. రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. కంటి ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. చర్మంపై ముడుతలు, మొటిమలు పోగొట్టి వృద్ధాప్య లక్షణాలను దూరం చేస్తుంది. ఇమ్యూనిటీని పెంచి, వ్యాధులు దరి చేరకుండా కాపాడుతుంది.