Home Page SliderTelangana

రేవంత్..వచ్చే ఎన్నికలలో వికెట్ తీసేది మేమే

బీఆర్‌ఎస్ పార్టీపై, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై  సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు హరీశ్ రావు. తాను ఫుట్‌బాల్ ప్లేయర్‌నని గోల్ కొడతానని చెప్పిన రేవంత్ రెడ్డికి తాను క్రికెట్ ఆడతానని వచ్చే ఎన్నికలలో వికెట్ తీసేది తమ పార్టీయేనని జోస్యం చెప్పారు. కేటీఆర్‌ను, హరీశ్ రావును ఎలా డీల్ చేయాలో తనకు తెలుసని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ ముందు తన ముఖ్యమంత్రి సీటును కాపాడుకోవాలని హితవు చెప్పారు. రేవంత్ వచ్చే ఎన్నికలలో సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ను తెలంగాణ మరిచిపోయేలా చేశానని రేవంత్ చెప్పిన మాటలపై మండిపడ్డారు. తెలంగాణ అంటేనే కేసీఆర్ అన్నారు. తెలంగాణ నుండి కేసీఆర్‌ను ఎవ్వరూ వేరు చేయలేరన్నారు.