స్పెయిన్‌ను ముంచెత్తిన వరదలు..లెక్క తేలని మృతులు
స్పెయిన్‌లోని వాలెన్సియాను అకస్మాత్తుగా వరదలు ముంచెత్తాయి. దీని ప్రభావంతో ఎంతమంది మృతి చెందారో కూడా ఇంకా లెక్క తెలియడం లేదు. కొందరి మృతదేహాలు కనుగొన్నారు. దక్షిణ స్పెయిన్‌లో వరదల కారణంగా వీధులన్నీ బురద నీటితో నిండిపోయాయి. మరోవైపు వరదల్లో వందలాది కార్లు కొట్టుకుపోతున్నాయి. తప్పిపోయిన వారి కోసం డ్రోన్లతో గాలింపు చర్యలు చేపడుతున్నారు. వాలెన్సియా ప్రాంతంలో స్పెయిన్ ప్రధాని పెడ్రో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అధికారుల సలహాను అనుసరించాలని ప్రజలను కోరారు. పాఠశాలలకు సెలవు ప్రకటించారు. రైళ్ల రాకపోకలను నిలిపివేసి, 10 విమానాలను రద్దు చేశారు.
